తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణాలలో కుళాయిలకు మీటర్లతో ఛార్జీల మోత.. ప్రజల్లో ఆందోళన

Meters To Water Taps In Towns: ఆస్తిపన్ను పెంపు, చెత్త సేకరణపై పన్నుతో ఇప్పటికే ఆర్ధిక భారాన్ని మోస్తున్న ఏపీలోని పట్టణ ప్రజలకు ఇకపై కుళాయి నీటి భారమూ పడనుంది. కొత్తగా ఇస్తున్న తాగునీటి కనెక్షన్లతో ప్రయోగాత్మకంగా 24 గంటలపాటు నీటిని సరఫరా చేయనున్నారు. ఎంత నీటిని వినియోగిస్తున్నారో లెక్కలు కట్టి.. ఇప్పటివరకు చెల్లిస్తున్న ఛార్జీలను మున్ముందు పెంచుతారని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

meters for water taps
meters for water taps

By

Published : Dec 11, 2022, 10:35 AM IST

Meters To Water Taps In Towns: ఆంధ్రప్రదేశ్​లోని వివిధ పుర, నగర పాలక సంస్థల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ. 2,000 కోట్ల రూపాయలతో అమృత్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయడం.. రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం పెంచడం, ఇప్పటికీ కుళాయిలకు నోచుకోని ప్రాంతాల్లోని ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం పథక ప్రధాన ఉద్దేశం. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కడప తదితర నగరాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభించారు.

విశాఖలోని రెండు వార్డుల్లో కొద్దికాలంగా 24 గంటలూ నీటిని సరఫరా చేస్తున్నారు. విజయవాడలోని రెండు డివిజన్లలో పనులు పూర్తిచేసి, ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. మధురానగర్, పసుపునగర్ లో ఇళ్లకు కొత్తగా ఇస్తున్న కనెక్షన్లతోపాటు మీటర్లను బిగిస్తున్నారు. విశాఖలోనూ అతి త్వరలో మీటర్ల బిగింపు ప్రక్రియ చేపట్టనున్నారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, అపార్ట్​మెంట్​లలో కుళాయి కనెక్షన్లకు ప్రస్తుతానికి మీటర్లు ఉన్నాయి. వీరి నుంచి రుసుములు వసూలు చేస్తున్నారు.

ఇదే విధానాన్ని వ్యక్తిగత ఇళ్లకూ వర్తింపజేస్తారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పుర, నగరపాలక సంస్థల్లో ఇప్పటివరకు కుళాయిపై నెలకు కనిష్ఠంగా రూ.60, గరిష్ఠంగా 120 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే తాగునీటి సరఫరా కోసం చేస్తున్న ఖర్చుకు సమానంగా ఆదాయాన్ని సమకూర్చుకునే లక్ష్యంతో పుర, నగరపాలక సంస్థల అధికారులు ఈ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. మొదట ఖర్చు తగ్గించుకునే క్రమంలో ఇప్పటికే మురికివాడల్లో మినహా అన్నిచోట్లా పబ్లిక్ కుళాయిలను తొలగించారు.

నీటి వినియోగంపై లెక్కలు తెలుసుకోవడానికే మీటర్లు పెడుతున్నామని అధికారులు చెబుతున్న.. మాటల్లో నిజం లేదని వివిధ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మొదట ఇలాగే చెప్పి క్రమంగా అపార్ట్​మెంట్​ల తరహాలోనే ఛార్జీలను వసూలు చేస్తారని భావిస్తున్నారు. సంస్కరణల పేరిట ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సేవలకూ ధరలు నిర్ణయించడం దుర్మార్గమని వారు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి:ఇవాళ వివాహం.. రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పెళ్లి కుమార్తె

'నల్లగా ఉన్నాడు నాకీ పెళ్లి వద్దు'.. దండలు మార్చుకుంటుండగా షాకిచ్చిన వధువు

ABOUT THE AUTHOR

...view details