ప్రతీ నెల ఇంటింటికి తిరిగి మీటర్ బిల్లులు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ప్రైవేట్ మీటర్ కార్మికులను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో కలిపి మొత్తం 1,800ల మంది మీటర్ కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యుత్ శాఖ రెండు నెలలపాటు విద్యుత్ బిల్లులను నిలిపివేసింది. కార్మికులకు ఏప్రిల్, మే నెలలో నెలకు రూ.3 వేల చొప్పున ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు. అధికారులు ఆదేశించినా గుత్తేదారులు జీతాలు ఇవ్వకపోవడం వల్ల మీటర్ రీడింగ్ కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇంటి అద్దె కట్టలేక, నిత్యావసర సరకులు కొనుగోలు చేయలేకపోతున్నారు. అప్పులతో పస్తులుంటున్నారు. పెండింగ్లో ఉన్న జీతాలు ఇస్తామనడం వల్ల మీటర్ రీడింగ్ ప్రారంభించామని కార్మికులు చెబుతున్నారు.
ప్రాణాలు పణంగా పెట్టి విధులు