తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana RTC Merge in Government : ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం.. ఇక క్యాడర్‌ ఫిక్సేషన్‌ తేలాలి..! - తెలంగాణ తాజా వార్తలు

TSRTC Merge in Government : ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ మాత్రం అలాగే కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆర్టీసీ విలీనం వల్ల ఉద్యోగులకు ఎటువంటి లబ్ది చేకూరనుంది? కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల అక్కడ ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది.. వంటి వివరాలు తెలుసుకుందాం.

RTC
RTC

By

Published : Aug 1, 2023, 10:06 AM IST

Updated : Aug 1, 2023, 11:36 AM IST

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం

TSRTC Merge in Government Benefits : దేశంలోనే మొదటిసారిగా 1932లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైన సంస్థను నవంబర్‌ 1, 1951లో హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం ప్రకారం... 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల 373 మంది ఉద్యోగులున్నారు. వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వంలో విలీనం చేశాక కార్మికులు... సమ్మె చేసే హక్కును కోల్పోతారు. పొరుగున ఉన్న ఏపీలో ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయగా.. కార్పోరేషన్ యధావిధిగా ఉంది. కార్పోరేషన్ సైతం విలీనం చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయే అవకాశాలుండటంతో అలాగే కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా తెలంగాణలోనూ ఆర్టీసీ కార్పోరేషన్ అలాగే ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో ఉద్యోగుల విలీనానికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగ భద్రతతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జీతాలకు ఇబ్బంది ఉండదని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడేందుకూ.. ప్రభుత్వ సాయం ఉంటుందని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. కొత్త బస్సుల కొనుగోలు, పీఆర్​సీ వంటివి ఉంటాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు.

''ఆర్టీసీ కార్మికులను విలీనం చేయడం వల్ల ఇబ్బందులు, సమస్యలు ఉండవు. జాబ్ సెక్యూరిటీ, పని భారం తగ్గుతుంది. లావాదేవీలు, రావలసిన బకాయిలు ప్రభుత్వంలో విలీనం కావడం వల్ల అన్నీ సమకూరుతాయి. నమ్మకం, భరోసా అనేది కార్మికులకు వస్తుంది. కార్మికులు హర్షం చేయదగిన విషయం. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు'' -థామస్ రెడ్డి, టీఎంయూ ప్రధాన కార్యదర్శి

ఉద్యోగుల విలీనంలో క్యాడర్‌ ఫిక్సేషన్‌ అసలు సమస్యగా మారింది.ఆర్టీసీలోని కండక్టర్లు, హెల్పర్లు, కంట్రోలర్స్‌ వంటి పోస్టులు ప్రభుత్వంలో ఉండవు. దీంతో వారికి జీత భత్యాల విషయంలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరో విషయం ఆర్టీసీలోని ఎస్ఆర్​బిస్, ఎస్​బిటిలు ప్రభుత్వంలో ఉండవు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య సమస్యలకు రూ.30 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఎంత ఖర్చైనా కార్పొరేషనే చెల్లిస్తుంది. కానీ, ప్రభుత్వంలో కలిస్తే ఈహెచ్​ఎస్​లో కలుపుతారని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఏపీలో ఉద్యోగుల విలీనం తర్వాత కొత్త నియామకాలు, నూతన బస్సుల కొనుగోలు జరగలేదని ఆరోపణలున్నాయి. ఇటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.

''విలీనం అంటే కార్మికులే ప్రభుత్వ ఉద్యోగులు. కార్పొరేషన్ గురించి ఇంకా తెలియదు. పక్క రాష్ట్రంలో కార్పొరేషన్ అలాగే ఉంచారు. ఏదిఏమైనా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రభుత్వంలోని రూల్స్, కార్పొరేషన్ రూల్స్ వేరే ఉంటాయి. సబ్ కమిటీ వేస్తే ఆ సబ్​కమిటీలో ప్రధాన యూనియన్​లకు,యూనియన్ కార్మికులకు కమిటీ సభ్యులు చేయాలి. సుదీర్ఘంగా చర్చించాలి. వేతన సవరణ ద్వారా ప్రభుత్వం జీత భత్యాలు అమలు చేయాలి. వీటి గురించి చర్చించుకునేది ఉంది.'' -రాజిరెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి

ఉద్యోగులకు 3 వేల 600 కోట్ల బకాయిలు, బ్యాంకు రుణాలు 2 వేల 220 కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల బకాయిల్ని వీలైనంత తొందరగా తీర్చడానికి ప్రస్తుత విలీన నిర్ణయం దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీలో పింఛను పథకం లేదు. ప్రభుత్వంలో విలీనం చేశాక... వారిని కొత్త పింఛను విధానంలోకి తెస్తారా? లేదంటే అధిక పింఛను విధానం అమలవుతుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర కేబినేట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆ సంస్థ ఎం.డి సజ్జనార్‌ అన్నారు. ఎన్నో ఏళ్లుగా నిబద్దతతో పనిచేస్తోన్న సిబ్బంది శ్రమను గుర్తించి.. వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నరాష్ట్ర ప్రభుత్వానికి టీఎస్​ఆర్టీసీ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల కష్టాలను సీఎం కేసీఆర్ ఏకకాలంలో పోగొట్టారని ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌ అన్నారు. 43వేల మంది కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపారని ధన్యవాదాలు తెలిపారు.

ఇవి చదవండి

Last Updated : Aug 1, 2023, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details