ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఆ సంఘ కార్యాలయం నుంచి బస్‌భవన్ వరకు ర్యాలీని చేపట్టారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడి తెరాస ప్రభుత్వం వచ్చాక ఆర్టీసికి ఒరిగింది ఏమి లేదన్నారు. మూసివేతలు, ఔట్‌సోర్సింగ్ తప్పు అని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను సీఎం కేసీఆర్ అణచివేస్తున్నారని ఆరోపించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆర్టీసీలో ఇంతవరకు ఎన్నికలు నిర్వహించకపోవడం సరికాదన్నారు.ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి" - empolyeement
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి