మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ అంబర్‌పేట్‌లో చోటుచేసుకుంది. మహంకాళి ఆలయ వెనుక వీధిలో నివాసముంటున్న కట్టా నందిని(23) గత కొద్ది కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మానసిక సమస్యలతో బాధపడుతున్న యువతి ఆత్మహత్య - crime news
హైదరాబాద్ అంబర్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. మానసిన సమస్యలతో బాధపడుతున్న ఓ యువతి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమధ్య కాలంలోనే చికిత్స తీసుకుంటున్న యువతి... బలవన్మరణానికి పాల్పడటం కుటుంబసభ్యులను కలచివేసింది.
మానసిక సమస్యలతో బాధపడుతున్న యువతి ఆత్మహత్య
ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న నందిని ఆ తర్వాత మానసిక సమస్యల వల్ల ఇంటి వద్దే ఉంటోందని తల్లిందండ్రులు తెలిపారు. ఈ మధ్య కాలంలోనే మానసిక చికిత్సాలయంలో నందిని చికిత్స తీసుకుంటున్నట్లు వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.