హైదరాబాద్ శేరిలింగంపల్లి జోన్ మియాపూర్ డివిజన్లోని మయూరినగర్ కాలనీలో రూ. 2 కోట్లతో నిర్మిస్తున్న మల్టిజెన్ థీమ్ పార్కు, గుర్నాధం చెరువు అభివృద్ధి పనులను మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. మల్టిజెన్ థీమ్ పార్కులో ఆధునిక పద్ధతిలో దేశంలోనే మొదటగా మెమొరీ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో మెమొరీ గార్డెన్: మేయర్ రామ్మోహన్
గ్రేటర్ హైదరాబాద్‌లో గ్రీనరీని పెంపొందించుటకు జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. మల్టిజెన్ థీమ్ పార్కులో ఆధునిక పద్ధతిలో దేశంలోనే మొదటగా మెమొరీ గార్డెన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
3.5 ఎకరాల విస్తీర్ణంలో అనేక ప్రత్యేకతలు ఉండే ఈ థీమ్ పార్కు పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 320 పార్కులు, 50 థీమ్ పార్కులతో పాటు 120 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పార్కుల అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి థీమ్ పార్కుకు ఒక ప్రత్యేకత ఉంటుందని వెల్లడించారు. శేరిలింగంపల్లి జోన్‌లోని 70 చెరువుల్లో 20 చెరువుల రక్షణకు గుర్రపు డెక్కను తొలగించి, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి:'ఆరు నెలల్లో 175 వాయు నాణ్యత కేంద్రాలు!'