తెలంగాణలో వైఎస్ స్మారక కేంద్రం నిర్మించాల్సిందేనని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించిన గూడూరు..వైఎస్ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ వైఎస్ మెమోరియల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ విషయంలో జగన్ కూడా చొరవ తీసుకుని కేసీఆర్తో మాట్లాడాలని సూచించారు. వైఎస్ ప్రజల మనిషని...ఆయన్ను తమ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తే అది వారి వ్యక్తిగతమని స్పష్టం చేశారు.
'తెలంగాణలో వైఎస్ స్మారక కేంద్రం నిర్మించాలి' - KCR
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్మక కేంద్రాన్ని తెలంగాణలో నిర్మించాలని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు.
జగన్ కూడా చొరవ తీసుకుని కేసీఆర్తో మాట్లాడాలి : గూడూరు
ఇవీ చూడండి : "సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలు కూల్చవద్దు"