తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రూపు రాజకీయాలు చేస్తే పార్టీకే నష్టం: తలసాని - minister talasani

తెరాస చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి  తలసాని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సనత్​నగర్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి తన నివాసం వద్ద  ప్రారంభించారు.

'జున్​15లోగానే సభ్యత్వ నమోదు పూర్తిచేయాలి'

By

Published : Jun 30, 2019, 9:20 PM IST

తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, మహంకాళి బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ ఆయన ఇంటివద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. గ్రూపు రాజకీయాలు చేస్తే పార్టీకే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. నమోదు పూర్తిచేయడానికి జులై 20 వరకు ముఖ్యమంత్రి సమయం ఇచ్చినప్పటికీ 15లోగానే పూర్తి చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్, ఆకుల రూప, కుర్మా హేమలత, తరుణి, శేషుకుమారి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

'జున్​15లోగానే సభ్యత్వ నమోదు పూర్తిచేయాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details