తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh Immersion: 'సుప్రీంను ఆశ్రయించాం.. తీర్పుకు అనుగుణంగానే..' - గణేశ్ నిమజ్జనం

భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు మంత్రి తలసానిని కలిశారు. హుస్సేన్ సాగర్​లో మంత్రి తలసానిని కలిసిన భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సభ్యులుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించారు. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని... దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తలసాని తెలిపారు.

Ganesh Immersion
మంత్రి తలసానిని కలిసిన భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు

By

Published : Sep 14, 2021, 2:27 PM IST

వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు... మంత్రి తలసానిని కలిశారు. హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై ప్రత్యామ్నయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. తీర్పు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే అంశంపై నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు వచ్చి గణేశ్ నిమజ్జనానికి అనుమతివ్వాలని కోరారు. ఒక్కరోజు ఆగితే.. సుప్రీం కోర్టు ఏమి చెప్తుందో తెలిసిపోతుంది. ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగిపోయాయి. ట్యాంక్​బండ్​నే కాదు.. హైదరాబాద్​లోని చాలా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాము.

-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

అక్కడే చేసి తీరుతాం..

కోర్టు తీర్పు ఏదైనా కూడా నిమజ్జనం చేయొద్దని ఎక్కడా చెప్పలేదు. నిమజ్జనం చేయడంలో కొన్ని నిబంధనలు పెట్టారు. అది ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత. భారత పౌరుడిగా.. మతాలమీద నమ్మకున్న వాళ్లుగా ఆధ్యాత్మిక విలువలను కాపాడే దృష్ట్యా భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి అక్కడే నిమజ్జన కార్యక్రమాలు చేస్తుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

-భగవంత్ రావు, భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు

మంత్రి తలసానిని కలిసిన భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు

ఈ సంవత్సరం నిమజ్జనానికి అనుమతించాలని హౌస్ మోషన్ వేశామన్న తలసాని... దాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని వెల్లడించారు. ఈ అంశంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందని తెలిపారు. ఒక్క రోజులో దానికి సంబంధించిన తీర్పు వస్తుందని... ఆ తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. భక్తుల సెంటిమెంట్‌కు సంబంధించిన అంశం కాబట్టి వివాదాలకు పొదల్చుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఫోకస్

ABOUT THE AUTHOR

...view details