తెలంగాణ

telangana

ETV Bharat / state

Dharmapuri srinivas: డీఎస్​కు నాలుగైదు రోజుల్లో శస్త్ర చికిత్స... - Dharmapuri Srinivas‌

నాలుగైదు రోజుల్లో భుజానికి శస్త్ర చికిత్స చేస్తామని... రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri srinivas)​కు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం పూజ గది నుంచి బయటకు వస్తుండగా ఆయన కింద పడిపోవడంతో భుజానికి ఫ్రాక్చర్ అయింది.

Dharmapuri srinivas
రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్

By

Published : Sep 28, 2021, 7:17 AM IST

రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ (Member of Rajya Sabha Dharmapuri Srinivas‌) ఇంట్లో జారిపడ్డారు. దాంతో ఆయన భుజానికి గాయమైంది. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో సోమవారం ఉదయం పూజ గది నుంచి బయటకు వస్తుండగా ఆయన కింద పడిపోయారు.

వెంటనే కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే తీసి భుజానికి ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించారు. నాలుగైదు రోజుల్లో శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకువచ్చామని డీఎస్‌ కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ (Nizamabad MP Arvind) తెలిపారు.

ఇదీ చూడండి:Tourism Awards for RFC: రామోజీ గ్రూప్‌ సంస్థలకు రెండు ఎక్సలెన్సీ అవార్డులు

ABOUT THE AUTHOR

...view details