భాగ్యనగర ఫ్యాషన్ ప్రియుల కోసం బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో వస్త్రాభరణాల ప్రదర్శన ఏర్పాటైంది. మెలోడ్రామా పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను వర్ధమాన సినీ కథానాయిక నిఖిత, గౌరవ్ అవార్డ్ గ్రహీత సంగీత కొసూరు కలిసి ప్రారంభించారు.
ఆధునిక, సంప్రదాయ మేళవింపుగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 60 స్టాళ్లులో దాదాపు 50 వేలకు పైగా ఉత్పత్తులు కొలువుదీరాయి. మగువలకు కావాల్సిన అన్ని రకాలైన వస్త్రాభరణాలను ఒకే వేదికపై ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని కథానాయిక నిఖిత అన్నారు.
ప్రస్తుతం తెలుగులో మూడు చిత్రాల్లో నటిస్తున్నట్లు తన సినిమా విశేషాలను తెలియజేశారు. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన నగరవాసులకు అందుబాటులో ఉంటుందని నిర్వహకులు తెలిపారు.
మెలోడ్రామా వస్త్రాభరణాల ప్రదర్శన - వస్త్రాభరణాల ప్రదర్శన
ఆధునిక, సంప్రదాయ మేళవింపుగా హైదరబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో మూడు రోజుల పాటు వస్త్రాభరణాల ప్రదర్శన కొనసాగుతుంది.

మెలోడ్రామా వస్త్రాభరణాల ప్రదర్శన
మెలోడ్రామా వస్త్రాభరణాల ప్రదర్శన
ఇదీ చూడండి: సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై డీజీజీఐ దాడులు