హైదరాబాద్ హుమాయున్‌నగర్ పీఎస్ పరిధిలోని మెహిదీపట్నంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఇద్దరు యాచకులను టిప్పర్ ఢీకొట్టింది. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు యాచకులను ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి - mehdipatnam road accident tipper hit two beggars
రోడ్డు దాటుతున్న ఇద్దరు యాచకులను టిప్పర్ ఢీకొట్టిన ఘటన హైదరాబాద్ హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహిదీపట్నంలో జరిగింది. ఘటనలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
ఇద్దరు యాచకులను ఢీకొట్టిన టిప్పర్.. ఒకరు మృతి