తెలంగాణ

telangana

ETV Bharat / state

గాలిలో తేమతో శుద్ధమైన తాగునీటి తయారీ

గాలిలో తేమతో తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. రైల్వే ప్రయాణికుల దాహార్తిని తీర్చే క్రమంలో శుద్ధమైన తాగునీరు అందించే అత్యాధునిక "మేఘదూత్ వాటర్  కియోస్క్"  విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

meghdoot water kiosk water plant inauguration in secundrabad railway station
గాలిలో తేమతో శుద్ధమైన తాగునీటి తయారీ

By

Published : Dec 12, 2019, 3:27 PM IST

గాలిలో తేమతో శుద్ధమైన తాగునీటి తయారీ

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటో ప్లాట్​ఫాం​లో గాలిలోని తేమతో శుద్ధమైన తాగు నీరందించే మేఘదూత్​ వాటర్​ కియోస్క్​ ప్లాంట్​ ప్రారంభమైంది.

రైలు ప్రయాణికులకు మంచినీరు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ప్లాంట్​ను ఏర్పాటు చేసినట్లు రైల్వే స్టేషన్ అభివృద్ధి సంస్థ ఎం.డి సంజీవ్​ లోహియా తెలిపారు. ఈ నీరు మినరల్ వాటర్ కంటే కూడా శుద్ధిగా ఉంటుందన్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులకు తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యతను దక్షిణ మధ్య రైల్వే... మైత్రి ఆక్వాడేట్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ సంస్థకు అప్పగించింది.

గాలిలోని తేమను ఒడిసిపట్టి, పలుమార్లు వడపోసి నీటిని శుద్ధి చేస్తారని మైత్రి ఆక్వాటెక్​ సంస్థ ఎండీ రామకృష్ణ తెలిపారు. ఐఆర్​టీసీటీ ప్రస్తుతం అందిస్తున్న ధరలకే ఈ నీటిని ప్రజలకు అందించనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details