తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ మంత్రి రఘువీరారెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు - megastar chiranjeevi

తన స్వగ్రామంలో ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేపట్టిన పురాతన ఆలయాల పునరుద్ధరణ చేసిన కార్యక్రమంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రఘువీరాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మాజీ మంత్రిపై.. చిరు వీడియో సందేశం ద్వారా ప్రశంసలు గుప్పించారు. కరోనా వల్ల ప్రారంభోత్సవానికి రాలేకపోతున్నానని.. త్వరలోనే కచ్చితంగా వస్తానని అన్నారు.

ex minister raghuveera reddy
మాజీ మంత్రి రఘువీరారెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు

By

Published : Jun 19, 2021, 12:24 PM IST

మాజీ మంత్రి రఘువీరారెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు

స్వగ్రామంలో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాల ప్రారంభోత్సవం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రఘువీరారెడ్డికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆలయాలతో.. ప్రారంభోత్సవంతో కొత్త దైవ కార్యానికి శ్రీకారం చుట్టిన రఘువీరారెడ్డికి వీడియో సందేశం ద్వారా ప్రశంసలు గుప్పించారు.

తన రాజకీయ ప్రస్థానంలో అనతికాలంలోనే రఘువీరారెడ్డి తనకు మంచి మిత్రుడయ్యారని మెగాస్టార్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో నేటి నుంచి 5 రోజుల పాటు ఆలయాల ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. కరోనా వల్ల ప్రారంభోత్సవానికి రాలేకపోతున్నానని... పరిస్థితులు కుదుటపడ్డాక కచ్చితంగా వస్తానని చిరంజీవి చెప్పారు.

ఇదీ చూడండి:Internet outage: ఆగిన వెబ్​సైట్లు, యాప్​లు

ABOUT THE AUTHOR

...view details