తెలంగాణ

telangana

ETV Bharat / state

టికెట్‌ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నాం: చిరంజీవి - Prabhas comments

Chiranjeevi
Chiranjeevi

By

Published : Feb 10, 2022, 1:38 PM IST

Updated : Feb 10, 2022, 2:51 PM IST

13:34 February 10

చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామం: చిరంజీవి

టికెట్‌ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నాం: చిరంజీవి

Chiranjeevi Comments: ఏపీ సీఎం జగన్‌ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామమని చెప్పారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరంజీవి చెప్పారు. మంత్రి పేర్ని నాని చొరవతో ఈ సమస్యలకు శుభంకార్డు పడిందని కొనియాడారు. హైదరాబాద్‌ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు జగన్‌ చెప్పారని చిరంజీవి తెలిపారు. దానికి తమ వంతు సహకారం ఉంటుందని చెప్పామన్నారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని.. సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలిపారు.

టికెట్‌ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నాం. ఏపీ సీఎం నిర్ణయం మమ్నల్ని అందరినీ సంతోషపరిచింది. చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామం. ఐదో షో వల్ల చిన్న సినిమా నిర్మాతలకు వెసులుబాటు కలుగుతుంది. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జరుగుతోంది. తెలుగులోనూ అధిక బడ్జెట్‌ సినిమాలు రావడం గొప్ప విషయం.

-- చిరంజీవి, సినీ నటుడు

సమస్యలకు పరిష్కారం...

సినీ పరిశ్రమకు ఇవాళ చాలా శుభపరిణామమని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. ఏపీ సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్న మహేశ్‌... ఆరు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమ గందరగోళంగా ఉందన్నారు. ఏపీ సీఎం చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఐదారు నెలలుగా గందరగోళ పరిస్థితి ఉందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. అందరి ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు వస్తున్నాయన్న ఆయన... చిరంజీవి చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు.

సినీ పరిశ్రమకు ఇవాళ చాలా శుభపరిణామం. ఏపీ సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆరు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమ గందరగోళంగా ఉంది. ఏపీ సీఎం చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

-- మహేశ్‌బాబు, సినీనటుడు

తెలుగు రాష్ట్రాల్లో సినిమా మనుగడ క్లిష్టంగా మారిందని పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి అన్నారు. భారీ చిత్రాల విడుదలపుడు చిన్న సినిమాల పరిస్థితి కష్టంగా మారిందని పేర్కొన్నారు. చిన్న సినిమాలను కాపాడాలని ఏపీ సీఎంను కోరినట్లు చెప్పారు. చిన్న సినిమాల మనుగడకు చర్యలు చేపడతామన్నారు. సినీ పరిశ్రమ సమస్యలను ఏపీ సీఎం దృష్టికి చిరంజీవి తెచ్చారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. చిన్న సినిమాల మనుగడపై ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. నెలాఖరులోపు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

సినీ పరిశ్రమ సమస్యలను ఏపీ సీఎం దృష్టికి చిరంజీవి తెచ్చారు. చిన్న సినిమాల మనుగడపై ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. నెలాఖరులోపు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాం.

-- పేర్ని నాని, మంత్రి

ఇదీ చూడండి: Tollywood Celebrities Meet AP CM Jagan: సీఎం జగన్​తో ముగిసిన సినీ ప్రముఖుల భేటీ

Last Updated : Feb 10, 2022, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details