మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్లో ఆయన అభిమానులు నిరాడంబరంగా జరిపారు. సమాజంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చిరు ఉద్యోగులను అందరూ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని జనసేన పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు రాజలింగం పేర్కొన్నారు.
నిరాడంబరంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు - chiranjeevi birthday celebrations
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు నిరాడంబరంగా జరిపారు. సినిమా థియేటర్లలో పనిచేసే సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
నిరాడంబరంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా థియేటర్లలో పనిచేసే సిబ్బందికి కొణిదెల యువసేన ఆర్టీసీ క్రాస్ రోడ్డు కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. కొవిడ్-19 దృష్ట్యా ఉపాధి కోల్పోయిన సినిమా థియేటర్ సిబ్బందికి కమిటీ ప్రతినిధులు బాబు, నాగరాజు, నరేష్‌లు నిత్యావసర సరకులను పంపిణీ చేయడానికి ముందుకు రావడం ప్రశంసనీయమని ఆయన అభినందించారు.
ఇవీ చూడండి: మెగాస్టార్.. మీరే మా స్ఫూర్తి, ధైర్యం