హైదరాబాద్ మెడికోవర్ ఆస్పత్రి మరోసారి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించింది. సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి చేపట్టిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కి హైటెక్స్ వేదికైంది. ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమై డ్రైవ్‌లో సుమారు 20వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా గత నెల 6న సుమారు 40వేల మందికి టీకాలు అందించిన మెడికోవర్.. రెండో డోస్ కోసం మళ్లీ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది.
తక్కువ సమయంలో ఎక్కువ మందికి..
టీకా తీసుకోవాలనుకునే వారు నేరుగా హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌లో స్పాట్ రిజిస్ట్రేషన్ లేదా ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చని మెడికోవర్ ఆస్పత్రి ప్రకటించింది. ప్రభుత్వ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నప్పటికీ వీలైనంత త్వరగా అందరికీ టీకా అందించాలన్న లక్ష్యంతో ఇలాంటి మెగా డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు మెడికోవర్ ప్రతినిధులు తెలిపారు.
జూన్ 6 తర్వాత మరోసారి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాం. రాష్ట్రంలో అందరికీ త్వరితగతిన అందరికీ వ్యాక్సినేషన్ అందించేలా మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మా నుంచి స్ఫూర్తితో ఇతర ఆస్పత్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను నిర్వహించడం సంతోషంగా ఉంది. మున్ముందు కూడా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు మరెన్నో చేపడతాం. -అనిల్ కృష్ణ, మెడికోవర్ ఎండీ