తెలంగాణ

telangana

ETV Bharat / state

VACCIN: మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన - vaccination in himayathnager

హైదరాబాద్​లో వ్యాక్సినేషన్ (VACCINATION) వేగంగా సాగుతోంది. హిమాయత్ నగర్ ఆక్స్​ఫర్డ్ గ్రామార్ హై స్కూల్​లో తెరాస సీనియర్ నాయకుడు మణికొండ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు... ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.

mega vaccination at himayathnager hyderabad
మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన

By

Published : Jun 13, 2021, 7:25 PM IST

కరోనా నియంత్రణ కోసం చేపట్టిన టీకాల పంపిణీ (VACCINATION) ప్రక్రియ... హైదరాబాద్​లో వేగంగా సాగుతోంది. తెరాస సీనియర్ నాయకుడు మణికొండ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో... చేపట్టిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. హిమాయత్ నగర్ ఆక్స్​ఫర్డ్ గ్రామార్ హై స్కూల్​లో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్​లో పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు టీకా వేయించుకున్నారు. ప్రతీఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకుని కరోనా కట్టడి యుద్ధంలో ప్రభుత్వానికి సహకరించాలని మణికొండ సురేష్ కుమార్ కోరారు.

హిమాయత్ నగర్, నారాయణగూడలో నివాసం ఉంటున్న ప్రజలకు ఇబ్బందులు కలకగకుండా తక్కువ రుసుముతో... వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ని నిర్వహించినట్లు తెలిపారు. కొవిడ్ కట్టడికి ఉత్తమమైన మార్గం వ్యాక్సినేషన్ ఒక్కటేనన్నారు.

ఇదీ చూడండి :జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

ABOUT THE AUTHOR

...view details