తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖలో 'ఆర్‌సీ 15' షూటింగ్‌.. చూసేందుకు తరలివచ్చిన అభిమానులు - గీతంలో రామ్​ చరణ్ మూవీ షూటింగ్

RC15 Movie Shooting in Visakhapatnam: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ విశాఖలో సందడి చేశారు. సినిమా చిత్రీకరణలో భాగంగా గీతం కళాశాలకు వచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థులు షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని తమ అభిమాన నటుడిని చూసి కేరింతలు కొట్టారు.

విశాఖలో రామ్​చరణ్​ షూటింగ్​ సందడి
విశాఖలో రామ్​చరణ్​ షూటింగ్​ సందడి

By

Published : Feb 13, 2023, 2:18 PM IST

RC15 Movie Shooting in Visakhapatnam: టాలీవుడ్​ మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్,​ స్టార్ డైరెక్టర్​ శంకర్​ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ 'ఆర్​సీ 15'. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఏపీలోని విశాఖలో జరుగుతోంది. విశాఖలోని గీతం కళాశాలలో చుట్టూ డాన్సర్ల మధ్య హెలికాప్టర్​ నుంచి రామ్​చరణ్ దిగుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. షూటింగ్​ విషయం తెలుసుకుని అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నటుడితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.

ఈ సినిమా చిత్రీకరణ కొద్దిరోజుల క్రితం కర్నూలులో జరిగింది. కర్నూల్​లోని కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేశారు. ఆ సమయంలోనూ అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు హైదరాబాద్​లోని చార్మినార్​ వద్ద​ షూటింగ్​ చేసిన మూవీ టీమ్​ ఇప్పుడు విశాఖ​లో తదుపరి చిత్రీకరణను మొదలుపెట్టింది.

ఇక సినిమా విషయానికి వస్తే.. దిగ్గజ దర్శకుడు శంకర్​ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్​గా రూపొందుతోంది 'ఆర్​సీ 15'. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అడ్వాణీ, అంజలితో పాటు ఎస్​. జె. సూర్య, నవీన్​ చంద్ర, సునీల్​ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో వైపు చరణ్‌ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

విశాఖలో రామ్​చరణ్​ షూటింగ్​ సందడి... చూడటానికి తరలి వచ్చిన అభిమానులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details