Mega DSC Notification Telangana 2024 :మెగా డీఎస్సీ నిర్వహణపై, విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రతిపాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని, టీచర్లు లేరంటూ మూసివేసిన చోట అవసరమైన మేరకు నియామకాలు జరపాలనిసీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ఆదేశించారు. పదోన్నతులు సత్వరమే పూర్తిచేసి, తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించడంతో అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈసారి డీఎస్సీ నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
Education Department On TS DSC 2024 :శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షలో, ఖాళీలు, ఉపాధ్యాయులులేని పాఠశాలలు, పదోన్నతుల ప్రక్రియ హేతుబద్ధీకరణకి చెందిన అంశాలను అధికారులు ఆయనకు నివేదించారు. గతప్రభుత్వ హయాంలో 5089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేశారు. అప్పుడు స్కూల్‌అసిస్టెంట్ 1739, భాషాపండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, ఎస్జీటీ 2575 పోస్టులు ఖాళీలుగా చూపారు. గత ఏడాది ఆగస్ట్ వరకు ఆ పోస్టులు లెక్కతేలాయి.
Teacher promotions Postpone Telangana : టీచర్లకు షాకింగ్ న్యూస్.. పదోన్నతులకు బ్రేక్.. ఎందుకంటే!
టెట్ ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పించాలనే నిబంధన దృష్ట్యా, ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల (Telangana Teachers Transfer ) ప్రక్రియ నిలిచిపోయిఉంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు, టెట్ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9000ల వరకు ఖాళీలు తేలే అవకాశం ఉంది. వాటన్నింటినీ డీఎస్సీ చేర్చాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలో ఖాళీ అయ్యే పోస్టులనూ కలపాల్సిఉంటుంది. ఆ లెక్కన 19,000ల నుంచి 20,000ల వరకు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
Telangana Mega DSC Notification 2024 :డీఎస్సీ నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం నుంచి 15 రోజుల్లో పూర్తిచేసి, సీఎం రేవంత్‌రెడ్డికి నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యాక తేదీలపై స్పష్టత రానుంది. తొలుత ఉపాధ్యాయ పదోన్నతులకోసం విధిగా టెట్(Telangana TET) నిర్వహించాల్సి ఉంటుంది. టెట్ నిర్వహణలో జాప్యంఉంటే, పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి, వాటినీ కలిపి డీఎస్సీ నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.