తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం: సీపీ సజ్జనార్​ - సైబరాబాద్​ కమిషనరేట్​లో రక్తదాన శిబిరం

పోలీస్ అమర వీరుల త్యాగాల వల్లనే రాష్ట్రం, దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్​ పోలీస్​ కమిషనరేట్​లో మెగా బ్లడ్​ డొనేషన్​ క్యాంప్​ నిర్వహించారు.

mega-blood-donation-camp-at-cyberabad-police-commissionerate-in-hyderabad
పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం: సీపీ సజ్జనార్​

By

Published : Oct 28, 2020, 11:09 AM IST

ప్రజలకు పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని సైబరాబాద్ సీపీ సజ్జనార్​ అన్నారు. పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. పోలీస్​స్టేషన్లలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని... వారి త్యాగాలను వెలకట్టలేమని సీపీ అన్నారు.

పోలీసులు చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేశారని సీపీ వెల్లడించారు. వారోత్సవాల్లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్​లోని మెయిన్ కాన్ఫరెన్ హాల్లో ఆన్​లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ పోలీస్ ఆయుధాలను ప్రదర్శించారు.

ఇదీ చూడండి: సిద్దిపేట సీపీపై చర్యలు తీసుకోవాలి: భాజపా శ్రేణులు

ABOUT THE AUTHOR

...view details