జీవితంలో 'హివారే బజార్' గ్రామాన్ని ఒక్కసారైనా కళ్లారా చూసి తరించాలని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి. ప్రకాశ్‌రావు అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నీటి నిర్వహణ వేదిక, ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ప్రకాశ్‌రావు పాల్గొన్నారు. గ్రామీణ భారతంలో మార్పు తీసుకొచ్చిన ప్రఖ్యాత నీటి రంగ నిపుణుడు పాపట్రావు బాగూజీ పవార్... సదస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశంలో నీటి సంరక్షణ, నిర్వహణలో ఆదర్శంగా నిలిచిన హివారే జజార్ నమూనాపై పాపట్రావు బాగూజీ పవార్ ప్రసంగించారు. బంగారు తెలంగాణ ఎప్పుడు నిర్మితమవుతుందో తెలియదు కానీ... హివారే బజార్ మాత్రం బంగారు గ్రామంగా మారిందని ప్రకాశ్‌రావు వివరించారు. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ స్వయం సమృద్ధి సాధించిన "హివారే బజార్" ఖ్యాతిగాంచిన దృష్ట్యా... ప్రతి ఒక్కరూ ఆ గ్రామం సందర్శించాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. ఏడు సూత్రాల ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన హివారేబజార్ను అభివృద్ధి చేయడం ప్రశంసనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు.
'జీవితంలో ఒక్కసారైనా హివారే బజార్‌ను సందర్శించాలి ' - హివారే జజార్
హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరభవన్లో నీటి నిర్వహణ, సంరక్షణ అంశాలపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రఖ్యాత నీటి రంగ నిపుణుడు పాపట్రావు బాగూజీ పవార్ పాల్గొన్నారు. పవార్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న హివారే బజార్ గ్రామ ఘనతను కార్యక్రమంలో ప్రముఖులు కొనియాడారు.
Meeting On Water Conservation in kairathabad