సీతారామ ప్రాజెక్టు నీళ్లు మానుకోట జిల్లాకు రావాలి : సత్యవతి రాఠోడ్
12:00 September 22
సీతారామ ప్రాజెక్టు నీళ్లు మానుకోట జిల్లాకు రావాలి : సత్యవతి రాఠోడ్
సీతారామ ప్రాజెక్టు విస్తరణపై మంత్రులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాఠోడ్.. మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇంజనీర్లు, అధికారులతో భేటీ అయ్యారు. ఇల్లందు, పాలేరు, వైరా, సత్తుపల్లి, పినపాక, ములుగు నియోజకవర్గాల్లోని భూములకు సాగునీరు అందించేందుకు చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు.
సీతారామ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం లబ్ధి పొందాల్సి ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా డోర్నకల్‌కు నీరు అందుతున్నప్పటికీ.. గార్ల, బయ్యారంలో సాగునీటి ఇబ్బంది ఉందని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న గార్ల, బయ్యారం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయని... ఈ మండలాలు సీతారామ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేలా చూడాలన్నదే తమ విజ్ఞప్తి అని తెలిపారు.
ఇదీ చదవండి:'నేరం రుజువైతే కనీసం 20 ఏళ్ల శిక్ష'