హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ మీడియా అధికార ప్రతినిధుల సమావేశం జరిగింది. మీడియా కమిటీ ఛైర్మన్ మల్లురవి దీనికి అధ్యక్షత వహించారు.గాంధీ భవన్లో సమాచారకేంద్రం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. సమాచార కేంద్రంలో మీడియా కో ఆర్డినేటర్‌గా అయోధ్యరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. టీవీల్లో నిర్వహించే చర్చలకు టీపీసీసీ తరఫున ఎవరు వెళ్లాలో జాబితా తయారు చేసి పంపాలని నిర్ణయించారు. ధరణి వెబ్‌సైట్ వ్యవసాయ అంశాలపైనా, 370 ఆర్టికల్‌తోపాటు ఇతర అంశాలపై వచ్చే సమావేశాల్లో చర్చించాలనే అభిప్రాయానికి వచ్చారు. 15 రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని తీర్మానించారు.
గాంధీభవన్‌లో మీడియా కమిటీ అధికార ప్రతినిధుల సమావేశం - mallu ravi
గాంధీభవన్‌లో కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన అధికార ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
గాంధీ భవన్లో మీడియా కమిటీ అధికార ప్రతినిధుల సమావేశం