హైదరాబాద్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. బాలరాజ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కార్మికవర్గంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ ఆగస్టు 9న సేవ్ ఇండియా డేగా కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.
''సేవ్ ఇండియా డే'ను విజయవంతం చేయండి' - latest news of save india day
రాష్ట్రంలోని కార్మిక, ఉద్యోగ సంఘాల ఆగస్టు 9న చేపడుతున్న 'సేవ్ ఇండియా డే'ను జయప్రదం చేయాలంటూ ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు నరసింహన్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కార్మికవర్గంపై జరుగుతున్న దాడులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ హైదరాబాద్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి.
''సేవ్ ఇండియా డే'ను విజయవంతం చేయండి'
ఆగస్టు 7,8 తారీఖుల్లో స్కీం వర్కర్లు చేస్తున్న ఉద్యమానికి అలాగే ఆగస్టు 5న ట్రాన్స్పోర్టు ఫెడరేషన్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించాలని తీర్మానించటం జరిగిందని ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు నర్సింహన్ తెలిపారు. అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్