First woman SHO : హైదరాబాద్‌లో మొట్టమొదటి మహిళా ఎస్హెచ్ఓగా సీఐ మధులత బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్ సమక్షంలో... లాలాగూడ పీఎస్ ఎస్హెచ్ఓగా మధులత విధులు స్వీకరించారు. 2002 బ్యాచ్‌కు చెందిన మధులత.... పాతబస్తీ మహిళా పోలీస్ స్టేషన్‌లో సీఐగా గతంలో పనిచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... హైదరాబాద్ పోలీసు చరిత్రలో తొలిసారి ఆమెకు ఎస్హెచ్ఓగా బాధ్యతలు అప్పగించారు.
First woman SHO: అప్పుడు చింతమడకకు ఎస్‌హెచ్‌వోగా చేశా... ఆ అనుభవంతోనే.. - హైదరాబాద్ తొలి ఎస్హెచ్ఓ
First woman SHO : హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలో తొలిసారి ఓ మహిళా అధికారి ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. లాలాగూడ పోలీస్ స్టేషన్ సీఐగా మధులత బాధ్యతలు స్వీకరించారు. మధులతతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి....
First woman SHO
మధులత మహిళా పోలీసులకు స్ఫూర్తిగా నిలవాలని..... పోలీసుశాఖ మహిళా దినోత్సవ వేడుకల్లో సీపీ సీవీ ఆనంద్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మధులత చెబుతున్నారు.
ఇదీ చదవండి :నగర పోలీస్ చరిత్రలోనే తొలిసారి.. మహిళా ఎస్‌హెచ్‌వోగా మధులత బాధ్యతలు