తెలంగాణ

telangana

ETV Bharat / state

Meet and Greet With KTR: 'విద్యాయజ్ఞంలో ప్రవాసీయులు భాగస్వామ్యం కావాలి' - telangana news

Meet and Greet With KTR: రాష్ట్రంలో 26 వేల పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కారు కంకణం కట్టుకుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. అమెరికా ప‌ర్యట‌న‌లో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో 'మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ విద్యాయ‌జ్ఞంలో ప్రవాసీయులు తమ వంతు సహాయం చేయాలని మంత్రి కోరారు.

Meet and Greet With KTR: 'విద్యాయజ్ఞంలో ప్రవాసీయులు భాగస్వామ్యం కావాలి'
Meet and Greet With KTR: 'విద్యాయజ్ఞంలో ప్రవాసీయులు భాగస్వామ్యం కావాలి'

By

Published : Mar 23, 2022, 3:15 PM IST

Meet and Greet With KTR: బల్క్‌ డ్రగ్స్‌, ఫార్మాసూటికల్స్‌, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో దేశానికే హైదరాబాద్‌ కేంద్రంగా ఉందని ఐటీపరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ‌పెట్టిన 'మ‌న ఊరు-మ‌న బడి' ప‌థ‌కంపై ఎన్ఆర్ఐల‌తో మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. అమెరికా ప‌ర్యట‌న‌లో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో 'మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

హైదరాబాద్‌లో రాష్ట్రప్రభుత్వం ముందుచూపుతో 250 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద వైద్య ఉపకరణాల పార్కు నెలకొల్పుతున్నట్లు కేటీఆర్​ వెల్లడించారు. అభివృద్ధిలో రాష్ట్రం ముందంజ‌లో ఉంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మౌలికవసతులకు పెద్దపీట వేశామన్న మంత్రి దేశానికి నిధులు స‌మ‌కూరుస్తున్న నాలుగో అతిపెద్ద రాష్ట్రంగా ఉందన్నారు. రూ.7,230 కోట్లతో 26 వేల పాఠ‌శాల‌ల‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంక‌ణం క‌ట్టుకుందని కేటీఆర్ తెలిపారు. ఈ విద్యాయ‌జ్ఞంలో ప్రవాసీయులు తమ వంతు సహాయం చేయాలని కోరారు.

దేశానికే హైదరాబాద్‌ కేంద్రంగా..

హైదరాబాద్​ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్రం ఏర్పడ్డాక మౌలికవసతులకు పెద్దపీట వేశాం. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​లో హైదరాబాద్​ బెంగళూరు కంటే మెరుగ్గా ఉంది. ఈజ్​ ఆఫ్​ డూయింగ్​ బిజినెస్​లో కూడా హైదరాబాద్​ మెరుగ్గా ఉంది. బెంగళూరులో ఐటీ రంగంలో పనిచేసే వారు 40శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారే. బల్క్‌ డ్రగ్స్‌, ఫార్మాసూటికల్స్‌, వ్యాక్సిన్ల ఉత్పత్తిలో దేశానికే హైదరాబాద్‌ కేంద్రంగా ఉంది. - కేటీఆర్​, రాష్ట్ర మంత్రి

'విద్యాయజ్ఞంలో ప్రవాసీయులు భాగస్వామ్యం కావాలి'

ఇదీల చదవండి:

ABOUT THE AUTHOR

...view details