CP Chauhan on Girl Gang Rape Case in Meerpet :హైదరబాద్ మీర్‌పేట్ పోలీస్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం సంచలనం సృష్టిచింది. హైదరాబాద్ లాల్‌బజార్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు కొంతకాలం కిందట మరణించారు. ఇద్దరు సోదరులు, బాలిక ఆలనాపాలనా చూసేవాళ్లు లేకపోవడంతో వారం రోజుల క్రితం మీర్పేట్లోని నందనవనంలోని తన అమ్మమ్మ .. సమీప సోదరి నివాసానికి తీసుకొచ్చారు. బాలిక దిల్‌సుఖ్‌నగర్‌లోని (Dilsukhnagar) ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది.
ఈ బాలిక నివాసానికి సమీపంలో ఉండే మంగళ్‌హాట్‌కు చెందిన రౌడీషీటర్ అబేద్ బిన్ ఖలేద్ అలియాస్ అబెద్ కొన్ని రోజులుగా బాధితురాలిని వేధిస్తున్నాడు. అబేద్‌పై మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రౌడీషీట్ ఉంది. హత్యాయత్నం సహా 26 కేసుల్లో నిందితుడు. గతంలో పీడీయాక్టుపై జైలుకెళ్లొచ్చాడు. గంజాయి తీసుకునే అలవాటున్న నిందితుడుశారీరకంగా కోరిక తీర్చాలంటూబాలిక వెంట పడుతుండేవాడు. పదేపదే వెంటపడడం.. వేధింపులు పెరగడంతో బాలిక అతణ్ని తీవ్రంగా మందలించింది. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు అవకాశం కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో తనతోపాటు జులాయిగా తిరిగే ఆరుగురు స్నేహితులతో కలిసి పథకం వేశాడు.
CP Chauhan on Meerpet Girl Gang Rape Incident :ఈనెల 21న ఉదయం తన స్నేహితులు నందనవనం కాలనీకి చెందిన మంకాల మహేశ్, నర్సింగ్ అలియాస్ బ్యాండ్ చిన్నా, వాచ్‌మెన్‌గా పనిచేసే అష్రఫ్, మలక్‌పేటకు చెందిన ఫ్లవర్ డెకరేషన్ కార్మికులు ఎండీ ఫైజల్, ఎండీ ఇమ్రాన్, తహసీన్ అలియాస్ టైసన్‌తో కలిసి అబేద్ నందనవనంలోని బాలిక నివాసానికి చేరుకున్నాడు. ఇంట్లో పెద్దలెవరూ లేని సమయం చూసి ఒక్కసారిగా కత్తులతో లోపలికి చొరబడ్డారు. బాలిక మెడపై అబెద్ కత్తి పెట్టి.. జుట్టుపట్టుకని ఈడ్చుకుంటూ భవనంలోని మూడో అంతస్తులోకి తీసుకెళ్లారు.
Meerpet Gang Rape Accused :అబెద్తో పాటు పైకిళ్లిన ఇద్దరు స్నేహితులు తహసీన్, మహేశ్‌లు కూడా అత్యాచారానికి ఒడిగట్టారు. మిగిలిన నర్సింగ్, అష్రఫ్, ఫైజల్, ఇమ్రాన్ నలుగురూ బాలిక సోదరులపై భయపెట్టి కిందకి తీసుకొచ్చారు. గదిలో బాలికను కత్తితో బెదిరిస్తూ అబేద్, తహసీన్, మహేశ్ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అనంతరం నిందితులంతా పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాలిక ఈ విషయాన్ని తన సోదరికి చెప్పింది. ఈ సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.