తెలంగాణ

telangana

ETV Bharat / state

Medtronic Company Investments in Telangana : రాష్ట్రంలో మరో దిగ్గజ సంస్థ భారీ పెట్టుబడి - Medtronic company invests 3000 crore rupees in ts

Medtronic Company Investments in Telangana : రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్య ఉపకరణాల తయారీలో మెడ్‌ ట్రానిక్‌ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా కేటీఆర్ మెడ్​ట్రానిక్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.

KTR
KTR

By

Published : May 18, 2023, 1:09 PM IST

Medtronic Company Investments in Telangana : రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్ వైద్య పరికరాలను తయారు చేసే మెడ్‌ట్రానిక్‌ సంస్థ.. రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. న్యూయార్క్​లో సంస్థ ప్రతినిధులను కలిసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ మేరకు వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మెడ్‌ ట్రానిక్స్ సంస్థకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని మెడికల్ హబ్​గా బలోపేతం చేసేందుకు ఈ సంస్థ కార్యకలాపాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని ఆయన వివరించారు.

ఇటీవలే మంత్రి కేటీఆర్ లండన్​లో పర్యటించారు. ఈ క్రమంలో పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు సంస్థలు కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే లండన్‌ స్టాక్​ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌ హైదరాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వచ్చే సంవత్సర కాలం నాటికి ఈ కేంద్రం ద్వారా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది.

ప్రొడక్ట్ డెవలప్​మెంట్ సెంటర్..: హైదరాబాద్​లో ప్రొడక్ట్ డెవలప్​మెంట్ సెంటర్​ను ఏర్పాటు చేస్తామని.. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ దిగ్గజం డాన్జ్ ప్రకటించింది. ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ తెలిపింది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో డాన్జ్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరో రసాయన పరిశ్రమ క్రోడా.. జీనోమ్ వ్యాలీలో గ్లోబల్ టెక్నికల్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

ప్లాస్టిక్​ రీసైక్లింగ్​ చేసే ఇన్​క్రెడిబుల్ హస్క్​​ సంస్థ..: ప్లాస్టిక్​ రీసైక్లింగ్​ చేసే ఇన్​క్రెడిబుల్ హస్క్​​ సంస్థ.. రూ.200 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో పరిశ్రమ పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇన్‌క్రెడిబుల్ హస్క్ సీఈవో కీత్ రిడ్జ్‌వే నేతృత్వంలోని బృందం.. కేటీఆర్​తో సమావేశమై ఇందుకు సంబంధించిన చర్చలు జరిపారు. ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్.. ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇండియా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్, పొట్టు ప్యాలెట్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్రంలో నెలకొల్పబోయే ప్రతిపాదిత తయారీ యూనిట్ సంవత్సరానికి 1000 మిలియన్ టన్నుల వరకు బయో ప్యాలెట్‌లను ఉత్పత్తి చేస్తుందని సంస్థ ప్రతినిధులు కేటీఆర్​కు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details