హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. నగరంలోని కోఠి, బేగంబజార్, నాంపల్లి, అబిడ్స్, సైఫాబాద్, లక్డీకాపూల్, బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో అరగంటకు పైగా మోస్తరు వర్షం ఆగకుండా కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిసి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, బాటసారులు ఇబ్బంది పడ్డారు.
హైదరాబాద్లో కురిసిన మోస్తరు వర్షం - హైదరాబాద్లో మోస్తరు వర్షం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. రోడ్ల మీద భారీగా వర్షం నీరు నిలిచి.. వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
![హైదరాబాద్లో కురిసిన మోస్తరు వర్షం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8168866-689-8168866-1595673850961.jpg)