ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వైద్య పరీక్షల నిమిత్తం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి(AP CM JAGAN IN MANIPAL HOSPITAL)కి వెళ్లారు. ఇటీవల ఇంట్లో వ్యాయామం చేస్తుండగా జగన్ గాయపడ్డారు. అప్పుడు ఎడమ కాలి నొప్పితో బాధపడ్డ జగన్.. మరోసారి కుడి కాలికి వాపు రావడంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల కోసం మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు.
Jagan in HOspital: ఆస్పత్రికి జగన్... విశ్రాంతి అవసరమన్న వైద్యులు.. అసలేమైంది?! - ap cm jagan latest news
వరుస సమావేశాలు.. పర్యాటనలు.. అధికారులతో సమీక్షలు.. పరిపాలనా వ్యవహరాలు.. పథకాల ప్రారంభోత్సవాలు.. ఇలా నిత్యం బిజీగా ఉంటున్న జగన్కు.. వైద్యులు పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.. ఇంతకీ జగన్కు ఏమైందంటే?!
AP CM jagan: ఆస్పత్రికి జగన్... విశ్రాంతి అవసరమన్న వైద్యులు.. అసలేమైంది?!
అక్కడ వైద్యులతో ఎమ్మారై స్కానింగ్తోపాటు, జనరల్ చెకప్ చేయించుకున్నారు. సుమారు రెండు గంటలపాటు జగన్కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లిపోయారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో.. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్షతోపాటు.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉన్న సీఎం జగన్ అపాయింట్‌మెంట్లన్నీ ఉన్నతాధికారులు రద్దు చేశారు.
Last Updated : Nov 12, 2021, 4:37 PM IST