దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ ఉద్ధృతంగా కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని... భారత వైద్య పరిశోధన మండలి సలహాదారు బీపీ ఆచార్య అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పక పాటించాలని సూచించారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట జీనోమ్ వ్యాలీలో నిర్వహించిన టీకా ఉత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు విధిగా టీకా వేసుకోవాలి: బీపీ ఆచార్య - హైదరాబాద్ తాజా వార్తలు
ప్రతి ఒక్కరు విధిగా కొవిడ్ టీకాను వేసుకోవాలని... భారత వైద్య పరిశోధన మండలి సలహాదారు బీపీ ఆచార్య తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని జీనోమ్వ్యాలీలో నిర్వహించిన టీకా ఉత్సవ్‌లో ఆయన పాల్గొన్నారు.
భారత వైద్య పరిశోధన మండలి సలహాదారు బీపీ ఆచార్య
ఐకేపీ నాలెడ్జ్ పార్కులో దాదాపు 90 మంది శాస్త్రవేత్తలకు, వివిధ కంపెనీలకు చెందిన ఉద్యోగులు టీకా వేయించుకున్నారు. ప్రతి ఒక్కరు విధిగా కొవిడ్ టీకాను వేసుకోవాలని బీపీ ఆచార్య తెలిపారు. వ్యాక్సిన్ సెంటర్లకు ప్రజలు వచ్చే విధంగా అవగాహన కలిగించాలని కోరారు.
ఇదీ చదవండి: యమ డేంజర్: రోడ్లపై తిరుగుతున్న కొవిడ్ రోగులు..కారణం అదే..!