Medical Health Services Recruitment Board: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకుగా ను ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,803 దరఖాస్తులు రాగా అందులో అర్హులైన 950 మంది జాబితాను బోర్డు విడుదల చేసింది.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఎంపికైన వారి జాబితా విడుదల..
Medical Health Services Recruitment Board: సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు గాను ఎంపికైన అభ్యర్థల లిస్ట్‌ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 969 సివిల్ అసిస్టెంట్ పోస్టులకు ఈ ఏడాది జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేయగా మొత్తం 4,803 దరఖాస్తులు వచ్చాయి. అందులో 950 మందిని ఎంపిక చేసినట్టు జాబితాను బోర్డు విడుదల చేసింది.
అందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 734, వైద్య విధాన పరిషత్ పరిధిలో 209, ఐపీఎంలో 7 పోస్టులకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఎంపిక చేశారు. గత నెలలో మెరిట్ లిస్ట్ విడుదల చేసిన బోర్డు.. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సహా ప్రక్రియను పూర్తి చేసి అర్హుల జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు ట్విటర్లో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: