తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒత్తిడిని జయించండి.. గుండెను కాపాడుకోండి: మంత్రి ఈటల - సొసైటీ ఆఫ్ ఇండియా కేబీఆర్ పార్క్ నుంచి ఆరు కిలోమీటర్ల వరకు సైకిల్ ర్యాలీలో నిర్వహించారు

ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఒత్తిడి నుంచి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.

'గుండె జాగ్రత్త' :ఈటల రాజేందర్

By

Published : Sep 29, 2019, 1:02 PM IST

'గుండె జాగ్రత్త' :ఈటల రాజేందర్

ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. మైహార్ట్, యువర్​హార్ట్, అవర్​హార్ట్​.. బీ ఏ హార్ట్ హీరో అనే నినాదంతో నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీని నిర్వహించింది. సైకిలింగ్ గుండెకు ఆరోగ్యకరమని సందేశం ఇస్తూ కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కేబీఆర్ పార్క్ నుంచి ఆరు కిలోమీటర్ల వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భారీగా ఔత్సాహికులు పాల్గొన్నారు. గుండెకు సంబంధించిన రోగాలు అన్ని వయసుల వారికి వస్తున్నాయని.. ఒత్తిడి తగ్గించుకుని జీవిస్తూ.. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఈటల సూచించారు.

ABOUT THE AUTHOR

...view details