రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 65,66,030 వ్యాక్సిన్ డోసులను వినియోగించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 1,81,882 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది. వారిలో హెల్త్ కేర్ వర్కర్లు 329, ఫ్రంట్ లైన్ వర్కర్లు 2666, 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారు 1,40,236 మంది ఉండగా.... 45 ఏళ్లు పై బడిన వారు 28,556 మంది ఉనట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Vaccination: రాష్ట్రంలో శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ - వ్యాక్సినేషన్ వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. తాజాగా 1,71,787 మందికి మొదటి డోస్ టీకాలు ఇచ్చినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 55,85,166 మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా... 14,58,831 మందికి రెండు డోసులు పూర్తైనట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
వ్యాక్సిన్ వార్తలు
ఇప్పటి వరకు 55,85,166 మందికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా... 14,58,831 మందికి రెండు డోసులు పూర్తైనట్టు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్రానికి మొత్తం 66,29,000 టీకా డోసులు అందాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి: Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీపై ఈనెల 14న మంత్రివర్గ ఉపసంఘం భేటీ