తెలంగాణ

telangana

ETV Bharat / state

'నూతన టెండర్లకు పిలవండి... సిబ్బంది నష్టపోతున్నారు' - హైదరాబాద్​ వార్తలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది కాలపరిమితి ముగిసినా... నూతన టెండర్లు పిలవట్లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్​ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. తమ డిమాండ్లు పరిశీలించాలంటూ టీస్​ఎంఐడీసీ మేనేజింగ్ డైరక్టర్​కు వినతి పత్రం అందించారు.

medical contact employees demands for tenders
'నూతన టెండర్లకు పిలవండి... సిబ్బంది నష్టపోతున్నారు'

By

Published : Mar 19, 2021, 1:45 PM IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, నర్సింగ్, టెక్నీషియన్ తదితర విభాగాల్లో కాంట్రాక్టుల కాలపరిమితి ముగిసింది. ఈ నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలవాలని.. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కోఠిలోని టీఎస్ఎంఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్​కు... వినతిపత్రం అందించారు.

2017లో కాంట్రాక్టు చేశారని... దాని కాలపరిమితి దాటి సంవత్సరం కావస్తున్నప్పటికీ నేటికి కూడా కొత్త టెండర్లు ఇవ్వట్లేదని యూనియన్ నాయకులు వాపోయారు. కొత్త టెండర్లు లేకపోవడం వల్ల ఆయా విభాగాల్లో పని చేస్తున్న వారికి... జీతాలు చాలా తక్కువ మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే నూతన టెండర్లను ఆహ్వానించి సిబ్బందికి కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు టెండర్​లో పొందుపర్చాలని సూచించారు.

ఇదీ చూడండి:'శిరిడీలో భక్తుల విరాళాల ​దుర్వినియోగం!'

ABOUT THE AUTHOR

...view details