తెలంగాణ

telangana

ETV Bharat / state

'సామాజిక కార్యక్రమాల కోసం ఏటా రూ.40 కోట్లు ఖర్చు' - తెలంగాణ తాజా వార్తలు

సింగరేణి సంస్థ ఏటా రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని... సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షుడు కె.రవిశంకర్ పేర్కొన్నారు. సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్​ సరూర్​నగర్​లోని సింగరేణి కాలనీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

medical camp for retired Singareni employees in Hyderabad
'సామాజిక కార్యక్రమాల కోసం ఏటా రూ.40 కోట్లు ఖర్చు'

By

Published : Feb 28, 2021, 5:08 PM IST

సింగరేణి సంస్థకు విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని... సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షుడు కె.రవిశంకర్ తెలిపారు. సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్​ సరూర్​నగర్​లోని సింగరేణి కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఆధ్వర్యంలో సమీప గ్రామాల ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ప్రతి నెలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంస్థ ఏటా రూ.40 కోట్లకు పైగా ఖర్చు చేసి సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన వారికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే సీపీఆర్ఎస్ కార్డులను పంపిణీ చేశామన్నారు. ఈ అవకాశాన్ని హైదరాబాద్​లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగరేణితో ఒప్పందం గల ఆసుపత్రుల్లో వినియోగించుకోవచ్చని చెప్పారు.

ఇదీ చదవండి: భాజపా ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోంది: కారెం

ABOUT THE AUTHOR

...view details