తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత, వ్యర్థాల తొలగింపునకు మీడియాకు అనుమతి ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పనులను రహస్యంగా చేస్తున్నారని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేశాయి.
'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?' - సచివాలయ పనుల పరిశీలన వార్తలు
సచివాలయ భవనాల కూల్చివేత పనులను మీడియా ప్రతినిధులు పరిశీలించారు. హైదరాబాద్ సీపీ నేతృత్వంలో సచివాలయ ప్రాంతాన్ని చూశారు.
'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'
ఎట్టకేలకు ప్రభుత్వం సచివాలయ పనుల పరిశీలనకు మీడియాకు అనుమతి ఇచ్చింది. కూల్చివేతల సందర్భంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడం వల్ల తగు జాగ్రత్తల నడుమ అధికారులే ఆ ప్రాంతాన్ని దగ్గరుండి చూపించారు. కూల్చివేత జరుగుతున్న తీరు, వ్యర్థాల తొలగింపు తదితర అంశాలను మీడియా ప్రతినిధులు క్షుణ్ణంగా చిత్రీకరించారు.
Last Updated : Jul 27, 2020, 5:48 PM IST
TAGGED:
సచివాలయ పనుల పరిశీలన వార్తలు