హైదరాబాద్ నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలని రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లను కోరారు.
మీడియా అకాడమీ భవనం పనులపై అల్లం సమీక్ష - hyderabad latest news
మీడియా అకాడమీ నూతన భవన నిర్మాణాన్ని త్వరితగతిన జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలని మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లను కోరారు. నాంపల్లిలో నిర్మాణంలో ఈ భవనాన్ని ఆందోల్ శాసనసభ్యుడు చంటి క్రాంతి కిరణ్తో కలిసి పరిశీలించారు.
అనంతరం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉండే విధంగా మీడియా అకాడమీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ భవనంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికేట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియా కాన్ఫరెన్స్ తోపాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆడిటోరియంను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి