తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకాశ్​ మరణం తీరని లోటు: అల్లం నారాయణ - hyderabad latest news

తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పొలంకి ప్రకాశ్​ మరణం తీరని లోటని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ ​నగర్​లోని ఎమ్మెల్యే క్వార్టర్స్​లో జరిగిన ప్రకాశ్​ సంతాప సభలో పాల్గొన్నారు.

ప్రకాశ్​ మరణం తీరని లోటు: అల్లం నారాయణ
ప్రకాశ్​ మరణం తీరని లోటు: అల్లం నారాయణ

By

Published : Aug 29, 2020, 6:41 PM IST

హైదరాబాద్ ఆదర్శ్ ​నగర్​లోని ఎమ్మెల్యే క్వార్టర్స్​లో తెలంగాణ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పొలంకి ప్రకాశ్​​ సంతాప సభ జరిగింది. సభకు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​తో పాటు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు.

తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తుల్లో ప్రకాశ్​ ఒకరని అల్లం నారాయణ తెలిపారు. ఆయన మృతి వీడియో జర్నలిస్ట్ సంఘానికి తీరని లోటన్నారు. బాధిత కుటుంబానికి మీడియా అకాడమీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 300 మంది జర్నలిస్ట్​ల కుటుంబాలకు రూ. 3000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ABOUT THE AUTHOR

...view details