తెలంగాణ

telangana

'అన్నపూర్ణ కేంద్రాల్లో యథావిధిగా భోజనం'

భాగ్యనగరంలో లాక్​డౌన్​తో మూసేసిన అన్నపూర్ణ కేంద్రాల్లో తిరిగి యథావిధిగా భోజనం అందించనున్నట్లు జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ వెల్లడించారు. హాస్టళ్ల విద్యార్థులకు, వర్కింగ్​పర్సన్స్​కు అదనంగా భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

By

Published : Mar 26, 2020, 6:57 AM IST

Published : Mar 26, 2020, 6:57 AM IST

Updated : Mar 26, 2020, 9:34 AM IST

మేయర్​ బొంతు రామ్మోహన్​మేయర్​ బొంతు రామ్మోహన్​
మేయర్​ బొంతు రామ్మోహన్​

హైదరాబాద్​లోని 150 అన్నపూర్ణ కేంద్రాల్లో గురువారం నుంచి ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. నానక్​రామ్​గుడా అన్నపూర్ణ సెంట్రల్ కిచెన్​ను, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్​ను డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో కలిసి మేయర్ పరిశీలించారు.

హాస్టళ్ల విద్యార్థులు, వర్కింగ్ పర్సన్స్​కు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీరికోసం అదనంగా వండి ఇవ్వాలన్న అభ్యర్థనకు అక్షయపాత్ర నిర్వాహకులు సంతోషంగా అంగీకరించారన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అనాథలు, నిరాశ్రయులకు జీహెచ్ఎంసీ అండగా నిలుస్తోందని మేయర్ తెలిపారు.

ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?

Last Updated : Mar 26, 2020, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details