తెలంగాణ

telangana

ETV Bharat / state

'లాల్ నిల్ ఐక్యత - కమ్యూనిస్టుల ఐక్యతే ఎండీ గౌస్​కు నిజమైన నివాళి' - చాడ వెంకట్ రెడ్డి తాజా వార్తలు

కమ్యూనిస్టుల ఐక్యతే ఎండీ గౌస్​కు నిజమైన నివాళి అని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరణించారని గుర్తు చేశారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో ఆయన సంతాప సభ నిర్వహించారు.

Md. Gauss Mourning, chada venkat reddy
ఎండీ గౌస్ సంతాప సభ, చాడ వెంకట్ రెడ్డి

By

Published : Apr 24, 2021, 9:13 PM IST

లాల్ నిల్ ఐక్యత - కమ్యూనిస్టుల ఐక్యత సాధనే ఎండీ గౌస్​కు నిజమైన నివాళి అని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. నిరంతరం కమ్యూనిస్టు భావాలతో కృషి చేసిన పోరాటయోధుడు గౌస్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో ఎంసీపీఐ (యు) జాతీయ నేత మహమ్మద్ గౌస్ సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరణించిన అమరజీవి కామ్రేడ్ మహమ్మద్ గౌస్ అని అన్నారు. ఆధిపత్య పాలనను అంతమొందించాలని ఆయన కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అశోక్, తాండ్ర కుమార్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణారెడ్డి, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నాం: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details