తెలంగాణ

telangana

ETV Bharat / state

'మేరు' పదానికి కులస్థులు వన్నె తీసుకురావాలి - వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్

మేరు అనే పదానికి కులస్థులు వన్నె తీసుకురావాలని ఎంబీసీ ఛైర్మన్​ తాడూరి శ్రీనివాస్​ కోరారు. హైదరాబాద్​ బషీర్​ బాగ్​ ప్రెస్​ క్లబ్​లో తెలంగాణ మేరు సంఘం కొత్త సంవత్సరం 2020 క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

'మేరు' పదానికి కులస్థులు వన్నె తీసుకురావాలి
'మేరు' పదానికి కులస్థులు వన్నె తీసుకురావాలి

By

Published : Dec 31, 2019, 6:48 PM IST


అత్యంత వెనుకబడిన తరగతుల కులాల (ఎంబీసీ)లోని 136 కులాలు మన సంస్కృతిలో భాగమేనని రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ మేరు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో సంఘం నూతన సంవత్సరం 2020 క్యాలెండర్​ను ఆవిష్కరించారు. మేరు అనే పదానికి కులస్థులు వన్నె తీసుకురావాలని తాడూరి సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని... తద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను మేరు కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . రాష్ట్రానికి కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత మేరు కులస్థులకు ప్రత్యేకంగా భవన నిర్మాణానికి ఒక ఎకరం స్థలం , కోటి నిధులను కేటాయించారని తాడూరి తెలిపారు.

'మేరు' పదానికి కులస్థులు వన్నె తీసుకురావాలి

ఇవీ చూడండి: వంద శాతం అక్షరాస్యతే ధ్యేయం: కేసీఆర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details