సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం డీఎన్కాలనీలో ఉంటున్న లక్ష్మారెడ్డికి ఇద్దరు కూతుళ్లు. అతని పెద్ద కుమార్తె అక్షిత ఎంబీఏ తొలి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 5వ తేదీన ఉదయం మీసేవా కేంద్రానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది.
పటాన్చెరులో ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం - Students Missing cases latest news
మీసేవా కేంద్రానికి వెళ్తానని చెప్పి వెళ్లిన ఎంబీఏ విద్యార్థిని రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవటం వల్ల ఆమె తండ్రి పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పటాన్చెరులో ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
సాయంత్రం వరకు ఇంటికి రాకపోవటం వల్ల తల్లిదండ్రులు కంగారుపడ్డారు. అనంతరం ఆచూకీ కోసం బంధువుల ఇంటి వద్ద వెతికినా లాభం లేకుండాపోయింది. ఆమె చరవాణికి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చినట్లు ఆమె తండ్రి వెల్లడించారు. రెండో రోజు కూడా ఆచూకీ లభ్యం కాకపోవటం వల్ల పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.