తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో మేయర్​ ఆకస్మిక పర్యటన - లింక్​ రోడ్ల అనుసంధానం

హైదరాబాద్​ నగర మేయర్​ బొంతు రామ్మోహ‌న్ ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో పర్యటించారు. ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న డీఆర్ఎఫ్ శిక్షణ కేంద్రం ప‌నుల పురోగతి గురించి తెలుసుకున్నారు. నగరంలో లింక్​ రోడ్ల అనుసంధానంపై అధికారులతో చర్చించారు.

Mayor's sudden visit to the lb nagar city
ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో మేయర్​ ఆకస్మిక పర్యటన

By

Published : May 15, 2020, 5:37 PM IST

హైదరాబాద్ న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మ‌గ్రంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న‌ట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ ఛైర్మన్‌, శాస‌న స‌భ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, పుర‌పాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్​తో క‌లిసి ఎల్బీన‌గ‌ర్ జోన్‌లో మేయ‌ర్ ప‌ర్యటించారు.

ఫ‌తుల్లాగూడ‌లో నిర్మిస్తున్న డీఆర్ఎఫ్ శిక్షణ కేంద్రం ప‌నుల పురోగతిని ప‌రిశీలించారు. నాగోల్ ఆర్‌టీఐ కార్యాల‌యం నుంచి బండ్లగూడ వ‌ర‌కు, అల్కాపురి నుంచి మ‌న్సూరాబాద్ వ‌ర‌కు ఉన్న రోడ్లను ప్రధాన రోడ్లతో అనుసంధానం చేసే మిస్సింగ్ లింక్ రోడ్ల‌ను ప‌రిశీలించారు.

ఇదీ చూడండి :మీరు పన్ను కట్టాల్సిన రోజొకటి ఉంది జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details