తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2021, 3:51 PM IST

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యతిస్తాం..: మేయర్‌

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు(sanitation workers) మేయర్‌ విజయలక్ష్మీ(mayor vijayalaxmi) కరోనా సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. కార్మికుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని మేయర్‌ అన్నారు.

mayor vijayalaxmi distributed safety kits to sanitation workers
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ

రానున్న వర్షాకాలం దృష్ట్యా స్వీయ ఆరోగ్య పరిరక్షణకై పారిశుద్ధ్య కార్మికులందరూ(sanitation workers).. విధిగా సేఫ్టీ కిట్లను(safety kits) ధరించి విధులకు హాజరు కావాలని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి(mayor vijayalaxmi) సూచించారు. డిప్యూటీ మేయర్‌తో కలసి జీహెచ్ఎంసీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు మేయర్‌.. సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు.

ఇప్పటికే కార్మికులందరికీ ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయించినట్లు మేయర్‌ పేర్కొన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. రూ.4,133 విలువైన ఒక్కో హెల్త్ కిట్‌ను 2,374 మందికి తొలిదశలో పంపిణీ చేశారు. ఖరీదైన ఈ కిట్లను తప్పనిసరిగా వాడాలని మేయర్‌ సూచించారు.

ఇదీ చదవండి:SI Arrest: జవహర్‌నగర్ ఎస్సై అనిల్‌ రాసలీలలు

ABOUT THE AUTHOR

...view details