తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ప్రాంతంలో 120 అడుగుల వెడ‌ల్పుతో రోడ్డు అభివృద్ధి - 120 feet road development at nagole

నాగోల్ జంక్షన్ నుంచి ఇందూ అర‌ణ్య వ‌ర‌కు బండ్లగూడ రోడ్డును 120 అడుగుల వెడ‌ల్పుతో అభివృద్ది చేయ‌నున్నట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్‌రెడ్డి, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి మేయ‌ర్ పర్యవేక్షించారు.

mayor said nagole road development with a width of 120 feet
ఆ ప్రాంతంలో 120 అడుగుల వెడ‌ల్పుతో రోడ్డు అభివృద్ధి

By

Published : Jun 11, 2020, 11:42 PM IST

హైదరాబాద్‌ నాగోల్ జంక్షన్ నుంచి ఇందూ అర‌ణ్య వ‌ర‌కు బండ్లగూడ రోడ్డును 120 అడుగుల వెడ‌ల్పుతో అభివృద్ది చేయ‌నున్నట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. రోడ్డు విస్తర‌ణ ప్రతిపాద‌న‌ల‌ను మూసి రివ‌ర్ ఫ్రంట్ ఛైర్మన్‌, ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్‌రెడ్డి ఇత‌ర అధికారుల‌తో క‌లిసి మేయ‌ర్ ప‌రిశీలించారు.

రోడ్డు విస్తర‌ణ భాగంలో ఉన్న ఒక దేవాల‌యం నిర్వహ‌కుల‌తో మాట్లాడారు. దేవాల‌యం అభివృద్ధికి ప్రస్తుతం ఎటువంటి ప‌నులు చేప‌ట్టరాద‌ని సూచించారు. రోడ్డు విస్తర‌ణ‌కు, దేవాయ‌లం అభివృద్ధికి ఎటువంటి స‌మ‌స్య రాకుండా చ‌ర్చించుకొని, ఒక నిర్ణయానికి వ‌ద్దామ‌ని నిర్వహ‌కుల‌కు వివ‌రించారు. రోడ్డు విస్తర‌ణ‌కు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ ప్రక్రియ‌ను వెంట‌నే చేప‌ట్టి, వేగంగా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను మేయ‌ర్ ఆదేశించారు.

పెద్దఅంబ‌ర్‌పేట మున్సిపాలిటీ ప‌రిధిలో ఉన్న ఓఆర్‌ఆర్ నుంచి ఇందూ అర‌ణ్య వ‌ర‌కు రోడ్డు విస్తర‌ణ ప‌నులు గ‌తంలోనే పూర్తయ్యాయి. నాగోల్ చౌర‌స్తా నుంచి ఉన్న మూడున్నర కిలోమీట‌ర్ల పొడ‌వున ప్రస్తుతం చేప‌డుతున్న విస్తర‌ణ‌తో న‌గ‌రానికి బ‌య‌ట నుంచి వ‌చ్చే వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ట్రాఫిక్ స‌మ‌స్య త‌గ్గుతుంది. ప్రత్యామ్నయ మార్గంగా ఔట‌ర్ రింగ్ రోడ్డుకు, వ‌రంగ‌ల్ ర‌హ‌దారికి, మ‌రో వైపు విజ‌య‌వాడ ర‌హ‌దారికి వెళ్లే వాహ‌న‌దారుల‌కు సౌక‌ర్యంగా ఉంటుంది.

ఇదీ చూడండి :జర్నలిస్టు కుటుంబానికి రఘునందన్ రావు పరామర్శ

ABOUT THE AUTHOR

...view details