గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు చెత్త బయట వేయొద్దని.. ఇళ్ల వద్దకు వచ్చే స్వచ్ఛ్ ఆటోల్లో మాత్రమే చెత్త వేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి కోరారు. నగరాన్ని డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా మార్చుతున్నామని... డంపింగ్ ప్రాంతాల్లో చెత్త వేయొద్దని ప్రజలకు సూచించారు. ఈ విషయంలో ప్రజల సహకారం ఉంటే... నగరాన్ని పరిశుభ్రంగా ఉంచొచ్చని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండో రోజు జరుగుతున్న ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పనులను మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు.
డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ : మేయర్ గద్వాల విజయలక్ష్మి - mayor vijayalaxmi inspection
హైదరాబాద్‌ని డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా మార్చనున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెండో రోజు జరుగుతున్న ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ పనులను ఆమె పరిశీలించారు.
సికింద్రాబాద్ జోన్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ద్య కార్మికుల బయో మెట్రిక్ మిషన్లు సరిగా పనిచేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్, రాంనగర్, భోలక్ పూర్, కవాడిగూడ, సీతాఫల్ మండి, బేగంపేట, కాచిగూడ డివిజన్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని బస్తీల్లో కూడా హైపోక్లోరైట్ స్ప్రేయింగ్ చేయాలని డీఆర్ఎఫ్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:'జీవితాలు, జీవనోపాధి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు'