సికింద్రాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతిని జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్షా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు, పలువురు కార్పొరేటర్లు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గంలో చేస్తున్న ఇంజినీరింగ్ పనులు, కొత్త ప్రతిపాదనలు, నాళాల పూడిక తీసివేత, శానిటేషన్, బస్తీ దవాఖానాలు, పబ్లిక్ టాయిలెట్లు వంటి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధి పనులపై ఆరా తీసిన మేయర్ - జీహెచ్ఎంసీ కార్యాలయం
సికింద్రాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై మేయర్ బొంతు రామ్మోహన్ ఆరా తీశారు. పెండింగ్లో ఉన్న పనులపై అధికారులతో సమీక్షించారు.
అభివృద్ధి పనులపై ఆరా తీసిన మేయర్
పార్కుల అభివృద్ధి, నిర్వహణ, రోడ్ల విస్తరణ, తుకారాంగేట్ రైల్వే అండర్ బ్రిడ్జి, వీధి లైట్లు తదితర పనుల గురించి సమావేశంలో చర్చించారు. పెండింగ్లో ఉన్న పనులను గురించి ఆరా తీశారు. భవిష్యత్లో చేయాల్సిన పనులకు సంబందించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో సీఈలు శ్రీధర్, జియాఉద్దీన్, జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిస్కం డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'
Last Updated : Mar 5, 2020, 12:15 PM IST