కరోనా కట్టడికోసం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ దోమలగూడ కంటైన్మెంట్ జోన్ చెక్‌పోస్ట్‌ను ఆయన తనిఖీ చేశారు. వివిధ కారణాలతో జోన్ నుంచి బయటకు వెళ్లేందుకు వచ్చిన వ్యక్తులను మందలించారు.
కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్ - mayor bonthu rammohanrao visited containment areas in hyderabad
హైదరాబాద్‌లో దోమలగూడ కంటైన్మెంట్ జోన్ చెక్‌పోస్ట్‌లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించి... ప్రజలెవరూ బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం మల్లాపూర్‌లో 300 మంది జీహెచ్ఎంసీ కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు.
![కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్ mayor bonthu rammohanrao visited containment areas in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6819852-thumbnail-3x2-mayor.jpg)
కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్
ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం మల్లాపూర్‌లో ఉన్న పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌ను పరిశీలించారు. హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో 300 మంది జీహెచ్ఎంసీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
TAGGED:
హైదరాబాద్ మేయర్ వార్తలు